బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 24, 2021 , 08:58:36

పెళ్లికి ముందు కారు యాక్సిడెంట్ చేసిన వ‌రుణ్

పెళ్లికి ముందు కారు యాక్సిడెంట్ చేసిన వ‌రుణ్

మ‌రి కొద్ది గంట‌ల‌లో అలీబాగ్‌లోని మాన్షన్ హౌస్‌లో త‌న ప్రేయ‌సి న‌టాషా ద‌లాల్‌ని పెళ్లి చేసుకోనున్న వ‌రుణ్ ధావ‌న్ గ‌త రాత్రి కారు యాక్సిడెంట్ చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌న ఫ్రెండ్స్‌కు బ్యాచిల‌ర్ పార్టీ ఇచ్చేందుకు వెళుతున్న వ‌రుణ్ ధావ‌న్ కారు అనుకోకుండా ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎవ‌రు గాయ‌ప‌డ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

కోవిడ్ వ‌ల‌న వ‌రుణ్ ధావ‌న్- న‌టాషా ద‌లాల్ పెళ్లికి కేవ‌లం కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులని మాత్ర‌మే ఆహ్వానించ‌గా ఇప్ప‌టికే వారంద‌రు అక్క‌డికి చేరుకున్నారు. మ‌రి కొద్ది గంట‌ల‌లో వ‌రుణ్‌- న‌టాషా జంట వేద‌మంత్రాల సాక్షిగా ఒక్క‌టి కానున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి బాలీవుడ్ నుండి షారూఖ్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్, క‌త్రినా వంటి సెల‌బ్స్ హాజ‌రు కానున్న‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లో రిసెప్ష‌న్ కూడా ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తుంది.

VIDEOS

logo