మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 25, 2021 , 07:18:38

పెళ్ళి ఫొటోలు షేర్ చేసిన వ‌రుణ్ ధావ‌న్

పెళ్ళి ఫొటోలు షేర్ చేసిన వ‌రుణ్ ధావ‌న్

బాలీవుడ్ యువ హీరో వ‌రుణ్ ధావ‌న్ ఎట్ట‌కేల‌కు త‌న ప్రేయ‌సి న‌టాషా ద‌లాల్‌ను జ‌న‌వ‌రి 24న కొద్ది మంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో ప‌రిణ‌య‌మాడాడు. ముంబైలోని అలీబాగ్‌లో ఉన్న మాన్సన్ హౌస్ రిసార్ట్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జ‌రిగింది . పెళ్లి వేడుక‌కు సంబంధించిన కొన్ని ఫొటోల‌ను వ‌రుణ్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌గా ఇవి వైర‌ల్ అయ్యాయి. ఇక నటాషాను పెళ్లాడిన వెంటనే రిసార్ట్స్ బయట మీడియా ప్రతినిధుల కోసం స్వీట్స్ పంపారు వరుణ్. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వ‌రుణ్ ధావ‌న్- న‌టాషాల‌కు స్కూల్ డేస్ నుండే ప‌రిచ‌యం ఉంది. తొలిసారి ఆమెను చూసి ఫిదా అయిన వ‌రుణ్ ధావ‌న్ ఆమెకు మూడు సార్లు ప్ర‌పోజ్ చేయ‌గా, రిజెక్ట్ చేసింద‌ట‌. ఆ త‌ర్వాత ఒప్పుకున్న న‌టాషా ఎట్ట‌కేల‌కు వ‌రుణ్ భాగ‌స్వామిగా మారింది. కాగా, వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ బాలీవుడ్‌లో సీనియర్ దర్శకుడు. ఇటీవ‌ల వ‌రుణ్‌తో కూలీ నెం 1 అనే సినిమా తెర‌కెక్కించారు.


VIDEOS

logo