శనివారం 23 జనవరి 2021
Cinema - Nov 28, 2020 , 13:30:09

కూలీ నెం1 ట్రైల‌ర్ విడుద‌ల‌.. పాత మ్యాజిక్‌ క్రియేట్ చేస్తున్న వ‌రుణ్‌

కూలీ నెం1 ట్రైల‌ర్ విడుద‌ల‌.. పాత మ్యాజిక్‌ క్రియేట్ చేస్తున్న వ‌రుణ్‌

1995లో  గోవిందా, క‌రీష్మా క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కూలీ నెం 1 అనే చిత్రం తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాని రీమేక్ చేస్తున్నారు వ‌రుణ్ ధావ‌న్, సారా అలీ ఖాన్. చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా, మేలో చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని భావించారు. కాని క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. అతి త్వ‌ర‌లోనే మూవీ విడుద‌ల‌కి ప్లాన్ చేశారు. అయితే చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా మూవీకి సంబంధించిన ట్రైల‌ర్ విడుద‌లైంది. 

ట్రైల‌ర్‌లోని స‌న్నివేశాలు సినిఆపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. పాత మ్యాజిక్‌ని వ‌రుణ్ ధావ‌న్, సారా అలీ ఖాన్ రీ క్రియేట్ చేస్తున్నార‌ని తాజా ట్రైల‌ర్ చూస్తే అర్ధ‌మవుతుంది. కొద్ది సేప‌టి క్రితం విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.logo