ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Cinema - Jan 21, 2021 , 11:58:34

మేన‌ల్లుడి వివాహాన్ని క‌న్‌ఫాం చేసిన వ‌రుణ్ ధావ‌న్ మామ‌

మేన‌ల్లుడి వివాహాన్ని క‌న్‌ఫాం చేసిన వ‌రుణ్ ధావ‌న్ మామ‌

ఈ ఏడాది బాలీవుడ్‌లో పెళ్లిళ్ల హంగామా మాములుగా ఉండ‌దు. జ‌న‌వ‌రి 24న  బాలీవుడ్ న‌టుడు వ‌రుణ్ ధావ‌న్ త‌న ప్రేయ‌సి  న‌టాషా ద‌లాల్ ని వివాహం చేసుకుంటాడ‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తుండ‌గా, దీనిపై వ‌రుణ్ మామ అనీల్ ధావ‌న్ క్లారిటీ ఇచ్చారు. జ‌న‌వరి 24న వ‌రుణ్- న‌టాషాల పెళ్ళి అలీబాగ్ లో జ‌ర‌గనుంది.  ఈ పెళ్లి కోసం నేను చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను అని పేర్కొన్నారు. గ‌తంలో వారి పెళ్లిపై వచ్చిన‌ వార్త‌ల‌న్నీ రూమ‌ర్స్ అని కొట్టి పారేసిన అనీల్ ఇప్పుడు ఏకంగా వారి వివాహ తేదిని కూడా అనౌన్స్ చేయ‌డం విశేషం.

క‌రోనా వ‌ల‌న ప‌రిమిత సంఖ్య‌లో అతిథుల‌ని ఈ వివాహానికి ఆహ్వానించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. కేవ‌లం 50 మంది గెస్ట్స్ మాత్రమే వేడుక‌లో పాల్గొంటార‌ట‌. షారుక్‌ఖాన్‌, స‌ల్మాన్‌ఖాన్ ,క‌‌ర‌ణ్‌జోహార్‌, శిల్పాశెట్టి-రాజ్‌కుంద్రా దంప‌తులు, డైరెక్ట‌ర్ రెమో డిసౌజా, శ‌శాంక్ కైతాన్ వంటి సెల‌బ్రిటీలు సైతం పెళ్లి వేడుక‌లో సంద‌డి చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే వ‌రుణ్‌- న‌టాషాల పెళ్లి వేడుక కార్య‌క్ర‌మాలు  జనవరి 22 నుంచి మొదలు పెట్టి 23, 24 మొత్తం 3 రోజులు  ధూమ్ ధామ్ గా జరగబోతుందని తెలుస్తోంది. కాగా, అతి త్వ‌ర‌లో ర‌ణ్‌బీర్ క‌పూర్- అలియా భ‌ట్ జంట‌, అర్జున్ క‌పూర్- మ‌లైకా అరోరా జంట కూడా పెళ్లి పీట‌లెక్క‌నున్నారు.


VIDEOS

logo