శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 27, 2021 , 18:27:10

వరుణ్‌, నటాషా వెడ్డింగ్‌ : తాజా ఫోటోలు వైరల్‌

వరుణ్‌, నటాషా వెడ్డింగ్‌ : తాజా ఫోటోలు వైరల్‌

ముంబై : అలీబాగ్‌లో ఆదివారం ఘనంగా జరిగిన బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌, నటాషా దలాల్‌ పెండ్లి వేడుకకు సంబంధించిన తాజా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. గత కొన్నేళ్లుగా సన్నిహితంగా మెలుగుతున్న వరుణ్‌, నటాషాలు పరిమిత సంఖ్యలో హాజరైన స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మాన్షన్‌ హౌస్‌ వేదికగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. వరుణ్‌ సంప్రదాయాలను పక్కనపెట్టి పెండ్లి మండపానికి బైక్‌పై చేరుకున్నాడు.

మరో ఫోటోలో స్నేహితులు, కుటుంబ సభ్యుల భుజాలపై ఎక్కిన వరుణ్‌కు నటాషా పూలమాల వేస్తూ కనిపించచారు. అంతకుముందు జైమాల కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ప్రముఖ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా సోషల్ మీడియాలో పంచుకున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 


VIDEOS

logo