గురువారం 04 జూన్ 2020
Cinema - Apr 24, 2020 , 09:00:34

హోమ్ మేడ్ కేక్ క‌ట్ చేసి బ‌ర్త్‌డే జ‌రుపుకున్న బాలీవుడ్ హీరో

హోమ్ మేడ్ కేక్ క‌ట్ చేసి బ‌ర్త్‌డే జ‌రుపుకున్న బాలీవుడ్ హీరో

లాక్‌డౌన్ వ‌ల‌న అన్ని దుకాణాలు బంద్ కావ‌డంతో బ‌ర్త్‌డేలు పెళ్లి రోజులు జ‌రుపుకోవాల‌నుకునే వారు కొద్ది పాటి నిరాశ చెందుతున్నారు. అయితే కొంద‌రు మాత్రం ఇంట్లోనే కేక్ త‌యారు చేసుకొని త‌మ కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఈ కేక్ క‌ట్ చేసి సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. తాజాగా వ‌రుణ్ ధావ‌న్ త‌న 33వ బ‌ర్త్‌డేని గురువారం అర్ద‌రాత్రి ఘ‌నంగా జ‌రుపుకున్నాడు.

ఇంట్లో త‌యారు చేసిన కేక్‌ని క‌ట్ చేసి వాటిని త‌న కుటుంబ స‌భ్యుల‌కి తినిపించాడు వ‌రుణ్ ధావ‌న్. బ‌ర్త్‌డేకి సంబంధించిన ఫోటోల‌ని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.  హార్ట్ షేప్‌తో ఉన్న కేక్‌తో దిగిన ఫోటోతో పాటు క‌ర‌ణ్ జోహార్ త‌న నుదుటిపై ముద్దు పెట్టిన ఫోటోని షేర్ చేశాడు. వ‌రుణ్ ధావ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీలు శుభాకాంక్ష‌ల వెల్లువ కురిపిస్తున్నారు 


logo