గురువారం 21 జనవరి 2021
Cinema - Dec 04, 2020 , 14:58:31

చిత్ర బృందంలో న‌లుగురికి క‌రోనా పాజిటివ్‌.. షూటింగ్‌కు బ్రేక్!

చిత్ర బృందంలో న‌లుగురికి  క‌రోనా పాజిటివ్‌.. షూటింగ్‌కు బ్రేక్!

వ‌రుణ్ ధావ‌న్, అనీల్ క‌పూర్, నీతూ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ్ మెహ‌తా తెర‌కెక్కిస్తున్న చిత్రం జ‌గ్ జ‌గ్ జియో. చంఢీఘ‌ర్‌లో కొద్ది రోజులుగా చిత్ర షూటింగ్ జ‌రుగుతుండ‌గా, ప్ర‌ధాన పాత్ర ధారులు వ‌రుణ్‌, అనీల్‌, నీతూల‌తో పాటు ద‌ర్శ‌కుడు క‌రోనా బారిన ప‌డిన‌ట్టు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌ల‌సి ఉంది. అయితే చిత్ర బృందంలో న‌లుగురికి క‌రోనా అని తెలియ‌డంతో వెంట‌నే షూటింగ్‌ని స్టాప్ చేశారు. 

రీసెంట్‌గా బీజేపీ ఎంపీ స‌న్ని డియోల్‌కు కూడా క‌రోనా పాజిటివ్ అని నిర్దార‌ణ అయింది. ప్ర‌స్తుతం ఆయ‌న స్వీయ నిర్భందంలో ఉన్నారు. కాగా, రిషి క‌పూర్ మ‌ర‌ణించిన త‌ర్వాత నీతూ క‌పూర్ న‌టిస్తున్న తొలి చిత్రం జ‌గ్ జ‌గ్ జియో. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లే స‌మ‌యంలో చిత్ర బృందంతో క‌లిసి దిగిన  ఫొటోని షేర్ చేస్తూ.. ఇలాంటి క‌ష్ట స‌మ‌యంలో నా తొలి ఫ్లైట్ జ‌ర్నీ. ఈ ప్ర‌యాణంలో కాస్త అసౌక‌ర్యంగా ఉన్నాను అని కామెంట్ పెట్టంది. జ‌గ్ జగ్ జియో చిత్రంలో కియారా అద్వానీ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. వ‌చ్చే ఏడాది చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. 


logo