శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 16, 2021 , 17:33:39

పెళ్లిపీటలెక్కబోతున్న హీరో.. ప్రియురాలితోనే ఏడడుగులు

పెళ్లిపీటలెక్కబోతున్న  హీరో.. ప్రియురాలితోనే ఏడడుగులు

కొన్ని నెలలుగా సినిమా ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు   మోగుతూనే ఉన్నాయి. ఈ ఇండస్ట్రీ.. ఆ ఇండస్ట్రీ అనే తేడా లేకుండా అంతా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. గతేడాది తెలుగులో రానా, నితిన్, నిఖిల్, కాజల్ సహా చాలా మంది వివాహం చేసుకున్నారు.   ఇప్పుడు 2021లో కూడా ఇదే కొనసాగుతోంది.    బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా మరో 10 రోజుల్లో పెళ్లి  చేసుకోబోతున్నాడ‌ని  తెలిసింది.   ఈయన గత కొన్నేళ్లుగా నటాషా దలాల్ తో డేటింగ్ చేస్తున్నాడు. ఈమెను పెళ్లి కూడా చేసుకుంటాడని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజానికి గతేడాది ఈ ఇద్దరి పెళ్లి జరగాల్సి ఉన్నా  కరోనా కారణంగా వాయిదా పడింది. జనవరి 24న ముంబైలోని అలీబాగ్‌లో ఈ స్టార్ హీరో పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.  ఈ వివాహానికి చాలా తక్కువ మంది మాత్రమే హాజరు కానున్నట్లు స‌మాచారం.

కేవలం 40 నుంచి 50 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించబోతున్నట్లు బాలీవుడ్  వ‌ర్గాలు అంటున్నాయి.     అలీబాగ్‌ లోని బీచ్‌ కు ఎదురుగా ఉన్న మొత్తం రిసార్ట్‌ను పెళ్లి వేడుక కోసం ధావన్ కుటుంబం బుక్ చేసుకున్నట్లు ముంబైలో  వార్తలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.    వరుణ్ ధావన్ తండ్రి, దర్శకుడు డేవిడ్ ధావన్ ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసాడు. ఇరు కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ నుంచి డేవిడ్ ధావన్‌కు అత్యంత సన్నిహితులు అయిన సల్మాన్ ఖాన్, మరికొందరు హీరోలు మాత్రమే ఈ పెళ్లికి రానున్నారు. జనవరి 22 నుంచి మొదలు పెట్టి 23, 24 మొత్తం 3 రోజులు వరుణ్ ధావన్ పెళ్లి ధూమ్ ధామ్ గా జరగబోతుందని తెలుస్తోంది. బాలీవుడ్ సెలబ్రెటీల కోసం ముంబైలోని ఒక స్టార్ హోటల్ లో ప్రత్యేకమైన పార్టీని కూడా నిర్వహించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యే కూలీ నెం 1 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు వరుణ్ ధావన్.

ఇవీ చదవండి:

సోనూసూద్ టైల‌రింగ్ షాప్‌

రామ్‌ చరణ్‌, రోజా.. ఇద్దరూ ఇష్టపడేది ఆ హీరోనే

ప్రభాస్‌ ‘సలార్‌’ లేటెస్ట్‌ అప్‌డేట్‌.. హీరోయిన్‌.. విలన్‌ ఎవరో తెలుసా?

VIDEOS

logo