బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 22, 2021 , 09:57:23

నాగ‌శౌర్య బ‌ర్త్‌డే.. స్ట‌న్నింగ్ టీజ‌ర్ విడుద‌ల‌

నాగ‌శౌర్య బ‌ర్త్‌డే.. స్ట‌న్నింగ్ టీజ‌ర్ విడుద‌ల‌

ప్ర‌తి సినిమాకు వైవిధ్యం చూపిస్తూ ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంటున్న కుర్ర హీరో నాగ శౌర్య‌. ప్ర‌స్తుతం ఈ యువ న‌టుడు సంతోష్‌ జాగర్లపూడి ద‌ర్శ‌కత్వంలో ల‌క్ష్య అనే సినిమా చేస్తున్నాడు. కేతికశర్మ  క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి  నారాయణదాస్‌ కె నారంగ్‌, రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ నిర్మాతలు. మ‌రోవైపు కేపీ రాజేంద్ర దర్శకత్వంలో  ‘పోలీసు వారి హెచ్చరిక’ అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు నాగ‌శౌర్య‌. మహేష్‌.ఎస్‌.కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక వ‌రుడు కావ‌లెను అనే పేరుతోను నాగ‌శౌర్య సినిమా చేస్తుండ‌గా, ఇందులో పెళ్లి చూపులు ఫేం రీతూవ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తోంది. సీనియ‌ర్ న‌టీన‌టులు ముర‌ళీశ‌ర్మ‌, న‌దియా ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్ టైనర్ గా వస్తోన్న ఈ చిత్రాన్ని ల‌క్ష్మీ సౌజ‌న్య (డెబ్యూట్‌) డైరెక్ట్ చేస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ విశాల్ చంద్ర‌శేఖ‌ర్. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ రోజు నాగ‌శౌర్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా వ‌రుడు కావ‌లెను టీం స‌ర్‌ప్రైజింగ్ వీడియో విడుద‌ల చేసింది. ఇందులో నాగ శౌర్య రెట్రో లుక్‌లో క‌నిపిస్తున్నాడు.


VIDEOS

logo