కెరీర్ మొదట్లో మంచి సక్సెస్లతో దూసుకెళ్లిన నాగ శౌర్యకి ఇప్పుడు సక్సెస్ అనేది కరువైంది. ఈ క్రమంలో భారీ హిట్ కొట్టాలని తహతహలాడుతున్నాడు. ప్రస్తుతం నాగ శౌర్య పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు . స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమాకు లక్ష్య అనే ఇంట్రస్టింగ్ టైటిల్ను ఫిక్స్ చేశారు.
శౌర్య తన హోమ్ బ్యానర్లో అనీష్ కృష్ణతో చేస్తున్న తన 22వ ప్రాజెక్ట్ షూట్లో పాల్గొంటున్నాడు. వీటితోపాటు లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య డైరెక్షన్లో వరుడు కావలెను అనే సినిమా చేస్తున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్గా తెలుగమ్మాయి రీతువర్మ నటిస్తుంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నిర్మాత రాధా కృష్ణ పుట్టినరోజు కానుకగా వరుడు కావలెను టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ చాలా ప్లెజెంట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. 30 వచ్చినా ఇంకా పెళ్లి అంటే ఇంట్రెస్ట్ చూపని అమ్మాయికి వరుడుగా శౌర్య ఏం చేసాడు అన్నట్టుగా కట్ చేసిన ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. హీరో హీరోయిన్స్ మధ్య డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఓవరాల్ గా మాత్రం ఈ టీజర్ ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి.అక్టోబర్లో చిత్రాన్ని విడుదల చేసే ఆలోచన చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్, హర్ష వర్ధన్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.