నటిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత యాంకర్‌గా సెటిలైన అందాల ముద్దుగుమ్మ వర్షిణి. అనసూయ, రష్మీలతో పోటీపడుతూ గ్లామర్ షో చేసే వర్షిణి తన సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్‌ను ఎక్కువగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది. అయితే ఈమె ప్రొఫెషనల్ సంగతుల కన్నా, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు నిత్యం వార్తలలో నిలుస్తూ ఉంటాయి. తాజగా ఈమె సీక్రెట్ ప్రేమాయణం నడుపుతుందనే వార్తలు భగ్గుమన్నాయి .
2017లో వర్షిణికి ఓ డైరెక్టర్‌తో నిశ్చితార్థమైన సంగతి తెలిసిందే. అయితే అది పెళ్లి పీటలవరకు వెళ్లలేదు. కారణం ఏంటనేది ఇప్పటి వరకు వర్షిణి చెప్పలేదు. తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో ఓ వ్యక్తి భుజంపై తలవాల్చి ఉన్న ఫొటోని షేర్ చేసి కొద్ది నిమిషాలలో డిలీట్ చేసింది. అయితే అప్పటికే దానిని చాలా మంది స్ట్రీన్ షాట్ తీసి షేర్ చేస్తున్నారు. ఫేస్ రివీల్ చేయకుండా సీక్రెట్‌గా ఉంచిందంటే అతడు వర్షిణికి కాబోయే వాడా అంటూ నెటిజన్స్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.