సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య సినిమాల కన్నా వివాదాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో వర్మ చేస్తున్న సినిమాలు ఎప్పుడు రూపొందుతున్నాయి, ఎప్పుడు థియేటర్స్‌లోకి వచ్చి పోతున్నాయో కూడా ఎవరికి అర్ధం కావడం లేదు. వర్మ రీసెంట్గా కన్నడ సీనియర్ స్టార్ హీరో ఉపేంద్రతో ఒక సినిమా చేయనున్నట్టుగా చెప్పారు.
ఉపేంద్ర పుట్టిన రోజున విషెస్ తెలుపుతూ తనతో ఒక యాక్షన్ సినిమా చేయబోతున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు వర్మ. మరి ఇది సరదాగా చేసిన వ్యాఖ్యనా, లేదంటే ఇందులో నిజం ఉందా అనే దానిపై క్లారిటీ రావలసి ఉంది. వర్మ గతంలో చాలా ప్రాజెక్టులు ప్రకటించాడు. ఆ తర్వాత వాటి ఊసే ఎత్తలేదు. ఉపేంద్రతో సినిమా నిజంగానే ఉంటుందా? అనే డౌట్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇటీవల ‘డియర్ మేఘ’ సినిమా ఫంక్షన్ లో ఆ సినిమా హీరో ఆదిత్ అరుణ్ తో తాను ఓ సినిమా చేయనున్నట్టు వర్మ ప్రకటించాడు. ఆ విషయం అప్పటికప్పుడు అనుకొని చెప్పాడు. ఇలానే ఉంటుంది వర్మ వ్యవహారం.