సోమవారం 25 మే 2020
Cinema - Apr 04, 2020 , 13:12:22

బ‌న్నీ 20వ చిత్రానికి ఆస‌క్తికర టైటిల్‌..!

బ‌న్నీ 20వ చిత్రానికి ఆస‌క్తికర టైటిల్‌..!

ఇటీవ‌ల అల వైకుంఠ‌పురములో చిత్రంతో మంచి హిట్ కొట్టిన బ‌న్నీ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 20వ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించనుండగా.. విజయ్ సేతుపతి పోలీస్ పాత్రలో, రష్మిక మందన్న పల్లెటూరి యువతిగా నటించబోతున్నట్లు టాక్.  జగపతి బాబు, రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం  అందిస్తున్నారు. ఏప్రిల్ 8న‌ బ‌న్నీ బ‌ర్త్‌డే  కావ‌డంతో చిత్రం నుండి ఆయ‌న లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

సుకుమార్- బ‌న్నీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఆర్య‌, ఆర్య‌2 చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో తాజా చిత్రంపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు యాసను మాట్లాడుతూ నెరిసిన గడ్డంతో క‌నిపించ‌నున్నాడ‌ట‌. సినిమా క‌థ‌ని బ‌ట్టి చిత్రానికి శేషాచలం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించిన క్లారిటీ మ‌రి కొద్ది రోజుల‌లో రానుంది.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు, క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo