శనివారం 30 మే 2020
Cinema - May 06, 2020 , 14:35:42

నాగార్జున‌- కృష్ణల ఆ నాటి చిత్రానికి 27 ఏళ్ళు..!

నాగార్జున‌- కృష్ణల ఆ నాటి చిత్రానికి 27 ఏళ్ళు..!

క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌కి కామెడీతో పాటు సెంటిమెంట్ జోడించి సినిమాలు తెర‌కెక్కించ‌డంలో దిట్ట ఈవీవీ సత్య‌నారాయ‌ణ‌. 27 ఏళ్ల క్రితం నాగార్జున‌, న‌గ్మా, కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వార‌సుడు అనే సినిమా తెర‌కెక్కించారు. 1993 మే 6న విడుదలైన ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ కీల‌క పాత్ర పోషించ‌డం అప్పట్లో సంచలనంగా మారింది. ఒక‌వైపు హీరోగా మంచి  సినిమాలు చేస్తున్నప్ప‌టికీ, కథలో ఉన్న ఇంపార్టెన్స్ దృష్ట్యా ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించారు ఈవీవీ. 

వార‌సుడు చిత్రం భారీ హిట్ సాధించ‌డానికి కార‌ణం నాగ్‌- కృష్ణ అనే చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా కృష్ణ .. నాగ్ తండ్రిగా, మాఫియా డాన్‌గా ప్రేక్ష‌కుల‌చే ప్ర‌శంస‌లు పొందారు.  న‌గ్మా త‌న గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకోగా, కీర‌వాణి అద్భుత‌మైన బాణీలు రూపొందించి ఆడియ‌న్స్‌ని థియేట‌ర్స్‌కి ర‌ప్పించాడు.  ఫస్టాఫ్ లో కాలేజీ సీన్లు, బ్రహ్మానందం కామెడీ సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. సెకండాఫ్ లో సెంటిమెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించి నాగ్ ను కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేసింది. జయభేరి బ్యానర్ లో కిషోర్ నిర్మాతగా మురళీమోహన్ నిర్మించిన ఈ సినిమా 24 సెంటర్లలో 100 రోజులు, కాకినాడలో 200 రోజులకు పైగా ఆడి నాగ్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.


logo