శనివారం 06 జూన్ 2020
Cinema - Apr 29, 2020 , 12:32:09

ఇంట్లో మ‌హిళ‌ల‌ని వేధిస్తే ఈ నెంబ‌ర్‌కి కాల్ చేయండి : న‌టి

ఇంట్లో మ‌హిళ‌ల‌ని వేధిస్తే ఈ నెంబ‌ర్‌కి కాల్ చేయండి : న‌టి

లాక్‌డౌన్ వ‌ల‌న అంద‌రు ఇళ్ళ‌కి ప‌రిమితం కావ‌డంతో కొన్ని చోట్ల గృహ హింస కేసులు ఎక్కువ‌గా న‌మోదవుతున్నాయి.ఇందులో కొన్ని బ‌య‌ట‌కి తెలుస్తున్నా, మ‌రి కొన్ని సీక్రెట్‌గా ఉంటున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో 1800 102 7282 నెంబ‌ర్‌కి కాల్ చేసి వారిని కాపాడాల‌ని కోరుతుంది త‌మిళ న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్.

లాక్‌డౌన్ స‌మ‌యంలో మ‌హిళ‌లపై వేధింపులు ఎక్కువయ్యే అవ‌కాశం ఉంది. నాలుగు గోడ‌ల మ‌ధ్య వారికి ఎలాంటి హాని అయిన త‌ల‌పెట్టవ‌చ్చు. అందుకే మీకు తెలిసిన మ‌హిళ‌ల‌కి 1800 102 7282 నెంబ‌ర్‌ని షేర్ చేయండ‌ని కోరింది వ‌ర‌ల‌క్ష్మీ. ఈ అమ్మ‌డు తెలుగులో క్రాక్ చిత్రంతో పాటు నాందిలో న‌టిస్తున్నారు

 


logo