నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా 107వ చిత్రం గ్రాండ్ గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది క్రాక్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్‌కుమార్ ఈ మూవీలో కీ రోల్ పోషించబోతుందని టాక్ నడుస్తోంది.
వరలక్ష్మి స్టోరీ వినగానే బాలయ్య సినిమాలో నటించే ఛాన్స్ రావడం పట్ల చాలా ఎక్జయిటింగ్ గా ఉందట. మరి బాలకృష్ణ లాంటి మాస్ యాక్టర్ ప్రాజెక్టులో వరలక్ష్మి ఎలాంటి పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. అఖండ చిత్రానికి సంబంధించిన పనులు పూర్తవగానే బాలయ్య-గోపీచంద్ మలినేని ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ఎస్ థమన్ ఈ ప్రాజెక్టుకు మ్యూజిక్ డైరెక్టర్.
ఇవి కూడా చదవండి..
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!