శరత్ కుమార్ గారాల పట్టిగా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆనతి కాలంలో తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ వరలక్ష్మీ శరత్ కుమార్. హీరోయిన్గా, విలన్గా, ప్రత్యేకమైన పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.తమిళంలోనే కాదు తెలుగులోను ఈ అమ్మడు తన నటనతో ఆకట్టుకుంది.
ఈ ఏడాది తెలుగు చిత్రాలలో ఎక్కువగా నటించి అలరించింది. క్రాక్ సినిమాలో విలన్గా, నాంది సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించి రెండు బ్లాక్ బస్టర్స్ని తన ఖాతాలో వేసుకుంది. వరలక్ష్మీకి ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం సందీప్ కిషన్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే వరలక్ష్మీ తాజాగా తన మేకప్ ఆర్టిస్ట్ తో దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. ఎమోషనల్ కామెంట్స్ చేసింది. అన్నింటా నువ్వే రమేష్ అన్నా.. నువ్ లేకపోతే నేను ఏం చేయలేను.. చేయగలిగేదాన్నికాదు.. నువ్ కేవలం నా మేకప్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. నువ్ నా కుడిభుజం లాంటి వాడివి. ఈ జర్నీ ఇంత వరకు వచ్చిందంటే కారణం నువ్వే. నీకు నేను ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ నచ్చిందని అనుకుంటున్నాను … హ్యాపీ బర్త్ డే అని ఎమోషనల్ కామెంట్ చేసింది. ఈ పోస్ట్ వైరల్గా మారింది.