బుధవారం 03 జూన్ 2020
Cinema - May 19, 2020 , 17:03:18

క్రికెట‌ర్‌తో న‌టి పెళ్ళి.. వైర‌ల్‌గా మారిన వార్త‌

క్రికెట‌ర్‌తో న‌టి పెళ్ళి.. వైర‌ల్‌గా మారిన వార్త‌

సినీ సెల‌బ్రిటీలకి సంబంధించి ఎన్నో గాసిప్ ప్ర‌తి రోజు వింటూనే ఉంటాం. ఇందులో నిజెమంతో అబద్ద‌మెంతో తెలియ‌క నెటిజ‌న్స్ అయోమ‌యానికి గుర‌వుతుంటారు. తాజ‌గా ఒక‌ప్ప‌టి హీరో శరత్ కుమార్ కూతురు  వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమ‌, పెళ్ళికి సంబంధించి తాజాగా ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తుంది. కొద్ది రోజులుగా ఫేమ‌స్ క్రికెట‌ర్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న ఈ అమ్మ‌డు ఇప్పుడు పెళ్లికి రెడీ అయింద‌ని టాక్.

వ‌ర‌ల‌క్ష్మీ ప్రియుడు ధోని, కోహ్లీకి అత్యంత స‌న్నిహితుడని, వీరి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకున్నాయ‌ని స‌మాచారం. లాక్‌డౌన్ ఎత్తేసాక వ‌ర‌ల‌క్ష్మీ స‌ద‌రు క్రికెట‌ర్‌తో ఏడ‌డగులు వేస్తుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలుస్తుంది.  మ‌రి ఈ వార్త‌ల‌పై వ‌ర‌ల‌క్ష్మీ ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి 


logo