బుధవారం 20 జనవరి 2021
Cinema - Oct 20, 2020 , 10:03:55

బిగ్ బాస్ భామ మూడో పెళ్ళి కూడా బిస్కెట్‌..!

బిగ్ బాస్ భామ మూడో పెళ్ళి కూడా బిస్కెట్‌..!

సీనియర్ నటులు మంజుల-విజయ్ కుమార్ దంపతుల పెద్ద కుమార్తె, బిగ్ బాస్ త‌మిళ ఫేమ్ వనిత విజయ్ కుమార్ కొద్ది రోజుల క్రితం మూడో పెళ్ళి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్ లో క్రిస్టియన్ వివాహ పద్ధతిలో వ‌నిత‌, పీటర్ పాల్ వివాహం జరిగింది. ఈ వివాహం త‌ర్వాత వ‌నితా రాజ్‌కుమార్ అనేక విమ‌ర్శ‌ల పాలైంది. 

వ‌నిత 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకోగా,  వీరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. మనస్పర్థల కారణంగా 2005లో ఆకాశ్ నుండి విడిపోయింది. ఆ తరువాత 2007లో ఆనంద్‌ జయదర్షన్‌ అనే వ్యాపారవేత్తను రెండోపెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు పుట్టింది. ఆనంద్ నుండి కూడా విడాకులు తీసుకున్న వ‌నిత  మూడో పెళ్ళి చేసుకుంది. వీరి పెళ్ళైన కొద్ది రోజుల‌కే వనిత తన మూడో భర్తను తన్ని ఇంట్లో నుంచి తరిమేసినట్లు వెలుగులోకి వచ్చింది.

వ‌నితా, పీట‌ర్‌లు త‌మ పిల్ల‌ల‌తో క‌లిసి గోవాకు  వెళ్ళ‌గా అక్క‌డ పీట‌ర్ ఫుల్‌గా తాగి ఆమెతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ట‌. ఇంటికి వ‌చ్చాక కూడా ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాక‌పోవ‌డంతో మూడో భ‌ర్త‌ని తన్ని ఇంట్లో నుంచి గెంటేసినట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘అక్రమ వివాహానికి వ్యతిరేకంగా చాలా మంది కోరుకున్న కోరిక నెరవేరింది. పీపీ(పీటర్ పాల్‌)ని ఆమె తన్ని తరిమేసింది’ అని కామెంట్ పెట్టారు.  మ‌రి ఈ వార్త‌ల‌పై వ‌నిత ఏమైన స్పందిస్తుంద‌నేది చూడాలి.


logo