శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 11, 2020 , 16:45:33

క్రేజీ ఆఫర్‌ కొట్టేసిన వాణికపూర్‌

క్రేజీ ఆఫర్‌ కొట్టేసిన వాణికపూర్‌

బాలివుడ్‌ బ్యూటీ వాణికపూర్‌ క్రేజీ ఆఫర్‌ను కొట్టేసింది. స్టార్‌ అక్షయ్‌కుమార్‌ అపకమింగ్‌ మూవీ బెల్‌బాటమ్‌లో హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ వాణికపూర్‌కు వచ్చింది. గూఢచారి థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న బెల్‌బాటమ్‌ చిత్రం 2021 ఏప్రిల్ 2 న విడుదల కానున్నట్లు నిర్మాతలు తెలిపారు. 

ఈ సందర్భంగా వాణికపూర్‌ మాట్లాడుతూ అక్షయ్ సర్ తో స్క్రీన్‌ను షేర్‌  చేసుకోబోతుండడం చాలా సంతోషాన్ని  కలిగిస్తుందన్నారు.  తాను స్క్రిప్ట్‌ విన్న వెంటనే ఓకే చెప్పేశానని, బెల్‌బాటమ్‌ సినిమా షూటింగ్‌లో ఎప్పుడెప్పుడు పాల్గొంటానా అని ఆసక్తిగా ఎదురు  చూస్తున్నానని ఆమె తెలిపారు. 

ఈ చిత్రంలో వాణిది మంచి మాత్ర అని నిర్మాత జాకీ భగ్నాని అన్నారు. వాణి తెలివైన, సమర్థవంతమైన నటి అని ఆమె ప్రదర్శనలన్నింటినీ చాలా ఇష్టపడుతానని ఆయన పేర్కొన్నారు. బెల్‌బాటమ్‌ సినిమాలో వాణి పాత్ర అక్షయ్‌తో సమానంగా ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 

అక్షయ్ గతేడాది నవంబర్‌లో ఈ చిత్రంలో తన లుక్‌ను నెటిజన్లతో పంచుకున్నాడు. ఒక లగ్జరీ కారు మీద అక్షయ్‌ సూట్‌లో గాగ్స్‌ పెట్టుకొని కూర్చోగా పైనుంచి విమానం వెళ్తున్న ఫస్ట్‌ లుక్‌ను అక్షయ్‌ విడుదల చేశారు. ఈ చిత్రం కన్నడ చిత్రానికి రీమేక్ కాదా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా “బెల్ బాటమ్ ఏ చిత్రానికీ రీమేక్‌ కాదు. ఇది నిజమైన సంఘటనల నుంచి ప్రేరణ పొందిన అసలు కథ’’ అని అక్షయ్‌ అన్నారు.

జయతీర్థ దర్శకత్వంలో వస్తున్న బెల్‌బాటమ్‌ కథను అసీమ్ అరోరా, పర్వేజ్‌ షేక్‌ రాశారు. ఈ ఏడాది చివరలో ఇది సెట్స్‌పైకి వెళ్తుంది. ఎమ్మే ఎంటర్టైన్మెంట్ సహకారంతో పూజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీన్ని వాషు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్షికా దేశ్ముఖ్, మోనిషా అద్వానీ, మధు భోజ్వానీ, నిఖిల్ అద్వానీ నిర్మించనున్నారు.


logo