శుక్రవారం 03 జూలై 2020
Cinema - Apr 12, 2020 , 23:36:25

కరోనా కౌగిట మృత్యు ఒడి చేరకు

కరోనా కౌగిట మృత్యు ఒడి చేరకు

వినరా వినరా సోదరా వినకుంటే ఇళ్లు ఆగమైతది కదరా.. కంటికి కనబడని కరోనా ప్రపంచాన విలయ తాండవం ఆడుతుందిరా.. గడపదాటి కాలు బయటపెట్టకు.. సోపతోళ్ల చెంత చేరి రోడ్డు మీద తిరగకు..ఆదమరచి కరచాలనం చేయకు.. కరోనా కౌగిట పడి  మృత్యు ఒడి చేరకు’ అంటూ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ పాట ద్వారా కరోనా వైరస్‌ పట్ల ప్రజల్ని అప్రమత్తం చేశారు. కోట్లు ఉన్నా ప్రాణం కాపాడలేమని, వేలాది ప్రాణాలను  తీస్తూ కరోనా మహమ్మారి కలవరపెడుతున్నదని, సూది మందు లేని ఈ రోగం వలన మనిషి బ్రతుకు చెల్లాచెదురైపోతుందనే సందేశాన్ని ఈ గీతంలో తెలియజేశారు. వందేమాతరం శ్రీనివాస్‌ సంగీతాన్ని అందిస్తూ  ఆలపించిన ఈ పాట ప్రతి ఒక్కరిలో ఆలోచనను రేకెత్తిస్తోంది. సుక్క  రామ్‌ నరసయ్య సాహిత్యాన్ని అందించారు.


logo