గురువారం 04 జూన్ 2020
Cinema - Feb 27, 2020 , 09:07:31

మ‌హేష్‌- వంశీ ప్రాజెక్ట్ ఆగిపోలేదు..!

మ‌హేష్‌- వంశీ ప్రాజెక్ట్ ఆగిపోలేదు..!

మ‌హేష్ బాబు- వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన మ‌హ‌ర్షి చిత్రం మంచి విజ‌యం సాధించడంతో మ‌రోసారి వీరిద్ద‌రు క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయాలని భావించారు. ఇటీవ‌ల వంశీ ..మ‌హేష్ ద‌గ్గ‌ర‌కి వెళ్లి స్క్రిప్ట్ వివ‌రించగా, దీనిపై సూప‌ర్ స్టార్ కొంత అసంతృప్తిగా ఉన్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాదు మ‌హేష్ అఇష్టంగా ఉన్న నేప‌థ్యంలో వంశీ పైడిపల్లి వేరే స్టార్స్‌తో ప్రాజెక్ట్ చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాడ‌ని చెప్పుకొచ్చారు. క‌ట్ చేస్తే మ‌హేష్‌- వంశీ ప్రాజెక్ట్‌కి సంబంధించి గ‌త కొద్ది రోజులుగా వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వాలు అని తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ పైన వ‌ర్క్ చేస్తున్న వంశీకి మ‌హేష్ కొన్ని సూచ‌న‌లు చేశాడట‌. దానికి త‌గ్గ‌ట్టే వంశీ పైడిప‌ల్లి కూడా స్క్రిప్ట్‌ని రూపొందిస్తున్నాడ‌ని, ప్రాజెక్ట్ ఆగింద‌నే వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని ఫిలిం న‌గ‌ర్ టాక్. అతి త్వ‌ర‌లోనే మ‌హేష్- వంశీ పైడిప‌ల్లి ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.


logo