ఆర్ఎక్స్ 100 చిత్రంతో మంచి హిట్ కొట్టిన కార్తికేయ హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు.ఒకవైపు హీరోగా, మరోవైపు విలన్‌గా నటిస్తూ అభిమానులని ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం రాజా విక్రమార్క అనే సినిమాలో హీరోగా నటిస్తున్న కార్తికేయ అజిత్ కుమార్ హీరోగా హెచ్. వినోత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్నవాలిమై చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు.
ఈ రోజు కార్తికేయ బర్త్ డే కావడంతో ఆయనకు సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తూ..వాలిమై టీమ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ పోస్టర్ లో కార్తికేయ చాలా రఫ్ అండ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రం లో బాలీవుడ్ భామ హుమా ఖురేషి మరొక కీలక పాత్ర లో నటిస్తున్నారు. బోని కపూర్ మరియు జీ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. గ్యాంగ్ లీడర్ చిత్రంలోను కార్తికేయ నెగెటివ్ షేడ్ పాత్రలో కనిపించి అలరించిన విషయం తెలిసిందే.