సంక్రాంతి పండుగకు పెద్ద సినిమాల సందడి ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సారి సంక్రాంతికి టాలీవుడ్ టాప్ హీరోలు బరిలోకి దిగుతుండడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. సంక్రాంతి బరిలో ముందుగా పవన్ కళ్యాణ్-రానాలు భీమ్లా నాయక్ సినిమాతో రానుండగా, ఆ తర్వాత సర్కారు వారి పాటతో మహేష్ బాబు, ఫన్ అండ్ ఫ్రస్టేషన్ తో వెంకటేష్, రెట్రో లవ్ స్టోరీతో ప్రభాస్ రిలీజ్ బరిలోకి దిగుతున్నారు.
జనవరి 12న భీమ్లా నాయక్ రానుండగా, 13న సర్కారు వారి పాట విడుదల కానుంది. 14న రాధే శ్యామ్ చిత్రంతో ప్రభాస్ పలకరించనున్నాడు. ఎఫ్ 3 చిత్రం కూడా ఈ మధ్యలోనే రిలీజ్ కానుంది. మరోవైపు తమిళ్ స్టార్ హీరో అజిత్ కూడా సంక్రాంతి బరిలోకి యాడ్ అయ్యారు. అజిత్ హీరోగా, కార్తికేయ విలన్ గా తెరకెక్కుతున్న రేసింగ్ యాక్షన్ డ్రామా వలిమై సంక్రాంతికి రానుందని అఫీషియల్‌గా ప్రకటించారు. దీంతో ఈ సారి స్టార్ హీరోల మధ్య పోటీ ఆసక్తికరంగా మారుతుందని అంటున్నారు.