బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 19, 2021 , 20:59:00

'వ‌కీల్‌సాబ్' కామిక్ బుక్ క‌వ‌ర్ లుక్ అదిరింది

'వ‌కీల్‌సాబ్' కామిక్ బుక్ క‌వ‌ర్ లుక్ అదిరింది

టాలీవుడ్ యాక్ట‌ర్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌కీల్‌సాబ్ చిత్రంతో ఆడియెన్స్ ను అల‌రించేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసిన ప‌వ‌న్ త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ కు అద్బుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. తాజాగా వకీల్ సాబ్ ను కామిక్ బుక్ క‌వ‌ర్ పేజీపైకి ఎక్కించాడు నిఖిల్ అనుదీప్ అనే వ్య‌క్తి. ప‌వ‌న్ క‌ల్యాణ్ గూండాల‌పై పంచ్ విసురుతున్న స్టిల్ ను డిజిట‌ల్ ఆర్ట్ రూపంలో డిజైన్ చేసి ఔరా అనిపిస్తున్నాడు. వావ్..వెల్‌డ‌న్ నిఖిల్ అంటూ మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ డిజిట‌ల్ ఆర్ట్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ట్వీట్ చేశాడు.

నిఖిల్ అనుదీప్ డిజైన్ చేసిన ఈ ఫొటో ఇపుడు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. దిల్‌రాజు-బోనీకపూర్‌ సంయుక్త నిర్మిస్తోన్న వ‌కీల్‌సాబ్ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌ మరో లాయర్‌గా కనిపించనున్నాడు. శృతిహాసన్‌ కీలకపాత్రలో నటిస్తోంది. వేణు శ్రీరామ్ డైరెక్ట‌ర్.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo