ఆదివారం 07 జూన్ 2020
Cinema - Mar 31, 2020 , 15:26:38

వ‌కీల్ సాబ్ ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్.. వైర‌ల్‌

వ‌కీల్ సాబ్ ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్.. వైర‌ల్‌

రెండేళ్ళ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ అనే చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్  రీసెంట్‌గా విడుద‌ల కాగా, ఇది మెగా అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రించింది. మేలో చిత్రాన్ని విడుద‌ల చేయాలని మేక‌ర్స్ భావించిన‌ప్ప‌టికీ, క‌రోనా కార‌ణంగా కొన్నాళ్ళు వాయిదా ప‌డింది.

తాజాగా వ‌కీల్ సాబ్ చిత్రానికి సంబంధించిన ఓ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఒక కోర్టు .. ఆ కోర్టు ఆవరణలో వకీల్ సాబ్ (పవన్)  ఒక చేత్తో ఫైల్స్ .. మరో చేత్తో రిపోర్టులు ఉన్న లెదర్ బ్యాగ్ ని పట్టుకుని నడుస్తున్నారు. ఇందులో ప‌వ‌న్ లుక్ ప్రేక్ష‌కుల‌కి విప‌రీతంగా న‌చ్చేసింది. అయితే అది అఫీషియ‌ల్ పోస్ట‌రా లేదంటే ఫ్యాన్ మేడ్ పోస్ట‌రా అనే దానిపై అభిమానుల‌లో కాస్త సందేహం నెల‌కొంది. ఖ‌చ్చితంగా ఇది ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ ఎందుకంటే వ‌కీల్ సాబ్ చిత్రంలో ప‌వ‌న్ భారీ గెడ్డంతో క‌నిపిస్తారు కాని ఇక్క‌డ క్లీన్‌ షేవ్ చేసుకొని ఉన్నారు. ఇది క్రిష్ సినిమా లుక్ అని అభిమానులు అంటున్నారు. దిల్ రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


logo