మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 02, 2020 , 09:04:50

మృతుల కుటుంబాల‌కి వ‌కీల్ సాబ్ బృందం రూ.2 ల‌క్ష‌ల సాయం

మృతుల కుటుంబాల‌కి  వ‌కీల్ సాబ్ బృందం రూ.2 ల‌క్ష‌ల సాయం

ప‌వన్ బ‌ర్త్‌డే సంబ‌రాల‌లో భాగంగా ఫ్లెక్స్ క‌డుతున్న ముగ్గురు అభిమానులు విద్యుత్ ఘాతానికి గురై క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే ఈ ఘ‌ట‌న పవ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌తో పాటు గాయ‌ప‌డ్డ వారికి అండ‌గా ఉంటానని చెప్పారు ప‌వ‌న్. అంతేకాక ‌చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆదేశించారు.

పవన్ నటిస్తున్న తాజా చిత్రం “వకీల్ సాబ్” చిత్ర యూనిట్ కూడా ఈ  ఘటనపై విచారం వ్య‌క్తం చేసింది. క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలువాల‌ని తెలియ‌జేస్తూ,  మృతి చెందిన కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని అందిస్తామని అధికారికంగా ప్రకటించారు. వ‌కీల్ సాబ్ చిత్రాన్ని బోనిక‌పూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. logo