వకీల్ సాబ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వచ్చేసాయి. ఎప్రిల్ 9న భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం కరోనాతో పోటీ పడి మరీ కలెక్షన్స్ సాధించింది. తొలి నాలుగు రోజులు అయితే సింపుల్ గా బాక్సాఫీస్ ను కుమ్మేసాడు పవన్ కళ్యాణ్. ఆ మాటకు దండయాత్ర అనే పేరు కూడా తక్కువే అవుతుంది. ఓ వైపు టికెట్ రేట్స్ తగ్గించినా కూడా పవర్ స్టార్ దూకుడు మాత్రం ఆగలేదు. కేవలం 30, 50 రూపాయల టికెట్స్ ధరతోనే ఏపీలో అరాచకం చేసాడు పవర్ స్టార్. నైజాంలో కూడా మంచి వసూళ్లు తీసుకొచ్చింది వకీల్ సాబ్. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ చిన్న పాత్రలో మెరిసింది. పింక్ సినిమా కథను పవన్ ఇమేజ్ కు తగ్గట్లు మార్చి చాలా బాగా తీర్చిదిద్ధాడు శ్రీరామ్ వేణు. పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు బయటి ఆడియన్స్ కూడా వకీల్ సాబ్ సినిమాను మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా ఫస్ట్ వీక్ ఏరియా వైజ్ వసూళ్ల లెక్కలు ఇప్పుడు చూద్దాం..
నైజాం- 24.26 కోట్లు
సీడెడ్- 13.04 కోట్లు
ఉత్తరాంధ్ర- 11.60 కోట్లు
ఈస్ట్- 6.30 కోట్లు
వెస్ట్- 7.42 కోట్లు
గుంటూరు- 7.20 కోట్లు
కృష్ణా- 4.95 కోట్లు
నెల్లూరు- 3.82 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)- 78.02 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 6.5 కోట్లు
ఓవర్సీస్- 6.20 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 91.34 కోట్లు షేర్
వకీల్ సాబ్ సినిమా 89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి తన సత్తా చూపించాడు పవర్ స్టార్. కొత్త సినిమాలు ఏవీ లేకపోవడంతో రెండో వారాంతం కూడా పవన్ కళ్యాణ్ హవా కనిపించడం ఖాయంగా కనిపిస్తుంది. కాకపోతే టికెట్ రేట్స్ తక్కువగా ఉండటంతో వసూళ్లు కూడా తక్కువగానే నమోదవుతున్నాయి. నైజాంలో మాత్రం భారీ టికెట్ రేట్స్ ఉన్నాయి. అందుకే ఇక్కడ నెంబర్స్ కూడా భారీగానే కనిపిస్తున్నాయి.