చూస్తుండగానే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ విడుదలై రెండు వారాలు గడిచిపోయాయి. సరిగ్గా 14 రోజుల కింద ఎప్రిల్ 9న భారీ అంచనాలతో విడుదలైంది వకీల్ సాబ్. కరోనా సెకండ్ వేవ్ అప్పుడప్పుడే ఊపందుకుంటున్న సమయంలో పవన్ సినిమా వచ్చింది. దాంతో పోటీ పడి మరీ మంచి కలెక్షన్స్ సాధించింది. ఓ వైపు ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్ తగ్గించినా కూడా పవర్ స్టార్ దూకుడు మాత్రం ఆగలేదు. కేవలం 30, 50 రూపాయల టికెట్స్ ధరతోనే ఏపీలో అరాచకం చేసాడు పవర్ స్టార్. నైజాంలో అయితే ఎప్పట్లాగే సత్తా చూపించాడు. కానీ ఆ తర్వాత మాత్రం సినిమా దూకుడు తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా ఏపీలో అయితే సినిమాకు కలెక్షన్స్ గణనీయంగా తగ్గిపోయాయి. కాకపోతే టికెట్ రేట్స్ అధికంగా ఉండటంతో నైజాంలో కూడా మంచి వసూళ్లు తీసుకొచ్చింది వకీల్ సాబ్.
దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ చిన్న పాత్రలో మెరిసింది. పింక్ సినిమా కథను పవన్ ఇమేజ్ కు తగ్గట్లు మార్చి చాలా బాగా తీర్చిదిద్ధాడు శ్రీరామ్ వేణు. పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు బయటి ఆడియన్స్ కూడా వకీల్ సాబ్ సినిమాను మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా 2 వారాల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇప్పుడు చూద్దాం..
నైజాం- 24.25 కోట్లు
సీడెడ్- 12.84 కోట్లు
ఉత్తరాంధ్ర- 11.72 కోట్లు
ఈస్ట్- 6.17 కోట్లు
వెస్ట్- 7.19 కోట్లు
గుంటూరు- 7.09 కోట్లు
కృష్ణా- 4.91 కోట్లు
నెల్లూరు- 3.34 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)- 77.52 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 3.58 కోట్లు
ఓవర్సీస్- 3.84 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 85.17 కోట్లు షేర్
వకీల్ సాబ్ సినిమా 89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు సినిమా 85 కోట్లు షేర్ వసూలు చేసింది. పవన్ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రం వకీల్ సాబ్. అత్తారింటికి దారేది 81 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు వకీల్ సాబ్ ఆ సినిమాను దాటేసింది. కానీ టికెట్ రేట్స్ తక్కువగా ఉండటంతో వసూళ్లు కూడా తక్కువగానే నమోదవుతున్నాయి. పైగా కరోనా కూడా ఉండటంతో లక్ష్యానికి 5 కోట్ల దూరంలోనే ఆగిపోయాడు పవర్ స్టార్. చివరికి అబౌ యావరేజ్ గా నిలిచింది వకీల్ సాబ్.
ఇవి కూడా చదవండి
తీవ్ర విషాదంలో పూజా హెగ్డే.. !
నేటి నుంచి శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు
కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను: మహేష్
బిడ్డకు ఉరేసి.. తల్లి ఆత్మహత్య