టాలీవుడ్ లో డెబ్యూ సినిమాతో సెన్సేషన్ క్రియేట్చేశాడు వైష్ణవ్ తేజ్. మెగా ఫ్యామిలీ హీరోగా పరిచయమైనా తొలి సినిమా ఉప్పెనతో ఊహించని రికార్డ్ లను సొంతం చేసుకున్నాడు. అందుకే అభిమానులు ఈ కుర్రాడిని మెగా యూత్ సెన్సేషనల్ హీరోగా పిలుచుకుంటున్నారు. ఇప్పుడీ హీరో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ ఆఫ్ ది టాపిక్ గా మారాయి.
పవర్ స్టార్ లాగా కళ్లతోనే కట్టిపడేసే ఈ హీరో ఇప్పుడా చూపులతోనే అమ్మాయిల మనసుని గుచ్చుతున్నాడు. కోరం మీసంతో మగతనాన్ని చూపిస్తూ కళ్లతోనే మాయ చేస్తున్నాడని లేడీ ఫ్యాన్స్ తెగ ఇదై పోతున్నారు. అటు కుర్రాళ్లమో ఈ తేజం ఏంటిరా బాబూ అంటూ పవర్ స్టార్ ని గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ ఏ సినిమా కోసం ఈస ఎన్సేషనల్ ఫోటోలు దిగావ్ వైష్ణవ్ తేజ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు సినీజనం.
ప్రస్తుతం ఉప్పెన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే క్రిష్ డైరక్షన్ లో సినిమాని పూర్తి చేయబోతున్నాడు. అలాగే ఈ మధ్యనే గిరీశయ్య డైరక్షన్ లో సినిమాని ప్రారంభించాడు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈసినిమాని నిర్మిస్తున్నారు. కేతికాశర్మ హీరోయిన్ గా నటిస్తోంది.