‘ఉప్పెన’ చిత్రం ద్వారా అరంగేట్రంతోనే పెద్ద విజయాన్ని దక్కించుకున్నాడు వైష్ణవ్‌తేజ్. ఈ సినిమాలో చక్కటి నటనతో ఆకట్టుకున్న అతడిని వరుస అవకాశాలు వరిస్తున్నాయి. వైష్ణవ్‌తేజ్ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కబోతున్నది. క్రీడా నేపథ్య కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాలో వైష్ణవ్‌తేజ్ హాకీ ప్లేయర్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం. తొలి సినిమాకు పూర్తి భిన్నంగా ైస్టెలిష్‌గా అతడు కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ సినిమాతో పృథ్వీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనున్నది.