శుక్రవారం 29 మే 2020
Cinema - Mar 28, 2020 , 10:33:00

న‌వ్వించే ఆయ‌న‌కి క‌న్నీళ్ళు ఎందుకొచ్చాయి ?

న‌వ్వించే ఆయ‌న‌కి క‌న్నీళ్ళు ఎందుకొచ్చాయి ?

క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌రూపం దాలుస్తున్న నేప‌థ్యంలో దానిని ఎలా క‌ట్ట‌డి చేయాలో తెలియ‌క ప్ర‌భుత్వాలు ఆందోళ‌న‌కి గుర‌వుతున్నాయి. సామాజిక దూరం పాటిస్తే కరోనా బారిన ప‌డ‌కుండా ఉంటామ‌ని ప్ర‌భుత్వాలు గొంతెత్తి చెబుతున్నా, ప్ర‌జ‌లు మాత్రం య‌దేచ్చ‌గా రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. సెల‌బ్రిటీలు కూడా వారిలో అవ‌గాహాన పెంచే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ప్ప‌టికీ, కొంద‌రు మార‌డం లేదు. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై స్పందించిన వ‌డివేలు క‌న్నీరు పెట్టుకున్నారు.

త‌న కామెడీతో క‌డుపుబ్బ న‌వ్వించే వ‌డివేలు జ‌నాల తీరుని చూసి భావోద్వేగానికి గుర‌య్యారు. నేను మ‌నోవేద‌న‌కి గుర‌వుతున్నా. ప్ర‌భుత్వాలు చెప్పింది విని కొద్ది రోజుల పాటు ఇంటి ప‌ట్టున ఉందాం. వైద్యులు, న‌ర్సులు ప్రాణాల‌ని ప‌ణంగా పెట్టి మ‌న‌ల్ని ర‌క్షిస్తున్నారు. ద‌యచేసి వారికి స‌హ‌క‌రిద్ధాం. పోలీసులు కూడా బ్ర‌తిమిలాడ‌డం చూస్తున్నా. ద‌య‌చేసి ఎవ‌రు బ‌య‌ట‌కి రాకండి. బిడ్డా పాప‌ల‌తో ఇంట్లోనే హాయిగా ఉందాం. ఎవ‌రు దీనిని తేలిక‌గా తీసుకోవ‌ద్దు అంటూ వ‌డివేలు ప్ర‌జ‌ల‌కి బాధాత‌ప్త హృద‌యంతో విన్న‌వించారు.


logo