మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 02, 2020 , 23:56:18

ఆ లెక్కలు వేసుకోలేదు

ఆ లెక్కలు వేసుకోలేదు

“వి’  సినిమాలో పోలీస్‌ అధికారిగా నా పాత్ర స్ఫూర్తివంతంగా ఉంటుంది.  నిజాయితీపరుడైన  పోలీస్‌కు ఓ సైకో కిల్లర్‌ ఎలాంటి సవాల్‌ విసిరాడు? వారి పోరాటం దేనికోసమన్నది ఆసక్తిని పంచుతుంది’ అని అన్నారు సుధీర్‌బాబు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘వి’.  ఈ నెల 5న అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదలకానుంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘యాక్షన్‌తో పాటు నాటకీయత ప్రధానంగా సాగే సినిమా ఇది. కథానుగుణంగా నాపై చిత్రీకరించిన పోరాట ఘట్టాలు రొమాంచితంగా ఉంటాయి.  ట్రైలర్‌లోని యాక్షన్‌ సీక్వెన్స్‌ చూసి మహేష్‌బాబు ప్రశంసించారు. ఇమేజ్‌, నిడివి లెక్కలు వేసుకోకుండా  కథను నమ్మి నేను, నాని ఈ సినిమా చేశాం. సినిమాలో మా ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. ప్రయోగాలతో కూడిన విభిన్నమైన కాన్సెప్ట్‌లకే ప్రాధాన్యతనివ్వాలనుకుంటున్నాను. ఆ ఆలోచనతోనే కొంతకాలంగా కథల ఎంపికలో నిదానంగా అడుగులు వేస్తున్నా.  రెండు కొత్త చిత్రాల్ని అంగీకరించాం. వాటి  వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతోంది. పాన్‌ ఇండియన్‌ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్‌లో ప్రారంభం కానుంది’ అని తెలిపారు. 


logo