మంగళవారం 02 జూన్ 2020
Cinema - Jan 28, 2020 , 23:52:25

మీసాల రాక్షసుడు

మీసాల రాక్షసుడు

‘గడ్డం, మెలితిరిగిన మీసాలు, రక్తం కారుతున్న చేతి, నిర్లక్ష్యపు చూపులతో కనిపిస్తున్న ఈ రాక్షసుడి కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వి’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌, హర్షిత్‌రెడ్డి నిర్మిస్తున్నారు. సుధీర్‌బాబు మరో హీరోగా నటిస్తున్నారు.  నాని లుక్‌ను మంగళవారం చిత్రబృందం విడుదలచేసింది. చేతిలో కత్తెర పట్టుకొని విభిన్నంగా కనిపిస్తున్నారాయన. ‘నాని విలక్షణ పాత్రలో నటిస్తున్న చిత్రమిది. రాక్షసుడి మాదిరిగా దర్శకుడు ఆయన్ని నవ్యరీతిలో తెరపై ఆవిష్కరిస్తున్నారు. ‘అష్టాచమ్మా’, ‘జెంటిల్‌మన్‌' తర్వాత  మోహనకృష్ణ ఇంద్రగంటి, నాని కలయికలో హ్యాట్రిక్‌ హిట్‌గా నిలుస్తుందనే నమ్మకముంది.  ‘నేను లోకల్‌', ‘ఎంసీఏ’ అనంతరం నాని , దిల్‌రాజు కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. పవర్‌ఫుల్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌గా సుధీర్‌బాబు నటిస్తున్నారు.యాక్షన్‌ థ్రిల్లర్‌  ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.  ఉగాది సందర్భంగా మార్చి 25న సినిమాను విడుదల చేస్తాం’ అని నిర్మాతలు తెలిపారు. నివేదాథామస్‌, అదితిరావు హైదరీ ప్రధాన పాత్రల్లో  నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అమిత్‌ త్రివేది, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా. logo