సోమవారం 03 ఆగస్టు 2020
Cinema - Jul 14, 2020 , 21:30:36

రిసార్టు బుక్ చేసిన యూవీ క్రియేష‌న్స్..?

రిసార్టు బుక్ చేసిన యూవీ క్రియేష‌న్స్..?

క‌రోనా కేసుల నేప‌థ్యంలో ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌కు గ‌డ్డు ప‌రిస్థితులు ఏర్ప‌డ‌టంతో అంద‌రూ ఓటీటీ ప్లాట్ ఫాం వైపు చూస్తున్న విష‌యం తెలిసిందే. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థ‌లు సైతం ఇపుడు త‌క్కువ బ‌డ్జెట్ లో డిజిట‌ల్ ప్లాట్ ఫాం కోసం సినిమాలు చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేష‌న్స్ త్వ‌ర‌లోనే లో బ‌డ్జెట్ తో సినిమాను లాంఛ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఎక్స్‌ప్రెస్ రాజా ఫేం మేర్ల‌పాక గాంధీ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌నున్నాడ‌ట‌.

అడ‌ల్ట్ థీమ్ ఆధారంగా యువ న‌టీన‌టుల‌తో ఈ సినిమాకు ప్లాన్ చేస్తున్న‌ట్టు టాక్‌. పేప‌ర్ బాయ్ ఫేం సంతోష్ శోభ‌న్, బ్ర‌హ్మాజీ కుమారుడు సంజ‌య్ (పిట్ట క‌థ ఫేం)ఈ చిత్రంలో లీడ్ రోల్స్‌లో న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కోసం యూవీ క్రియేష‌న్స్ వైజాగ్ లో ఓ రిసార్ట్ ను కూడా బుక్ చేసింద‌ట‌. ప్ర‌స్తుతం సంద‌ర్శకులు లేక నిర్మానుష్యంగా ఉన్న రిసార్టులు ఓటీటీ మూవీల‌కు స‌రిగ్గా స‌రిపోతున్నాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo