గురువారం 28 మే 2020
Cinema - May 12, 2020 , 17:52:48

టిక్‌టాక్‌లో వచ్చిన రూ .5 కోట్లను విరాళంగా ఇచ్చిన బాలీవుడ్‌ నటీ

టిక్‌టాక్‌లో వచ్చిన రూ .5 కోట్లను విరాళంగా ఇచ్చిన బాలీవుడ్‌ నటీ

ముంబై: కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటం చేస్తున్నవారికి సహాయంగా బాలీవుడ్‌ న‌టి ఊర్వ‌శీ రౌతేలా రూ .5 కోట్లు విరాళంగా ఇచ్చారు. మనమంతా కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, ఏ ఒక్క విరాళం కూడా  చిన్నది కాదని రౌతేలా అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి కరోనాపై పోరాడుతున్నవారికి మనం అందరం మద్దతుగా ఉండాలన్నారు. 

వర్చువల్ డ్యాన్స్ మాస్టర్ క్లాస్ నిర్వహించడం గురించి ఇటీవల తన అభిమానులకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఊర్వశి తెలియజేసిన విషయం తెలిసిందే.   బరువు తగ్గడానికి, డ్యాన్స్‌ నేర్చుకోవాలనుకునే వారందరికీ ఆమె సెషన్ ఉచితం. ఈ ప్రత్యేక సెషన్లలో రౌతేలా జుంబా, టాబాటా, లాటిన్ డ్యాన్స్ వంటివి నేర్పింది. టిక్‌టాక్‌లో ఆమె డ్యాన్స్ మాస్టర్‌ క్లాస్‌ను 18 మిలియన్ల మంది వీక్షించారు. దీనికి  ఊర్వ‌శీ రూ.5 కోట్ల మొత్తాన్ని అందుకుంది. టిక్‌టాక్‌ వీడియో ద్వారా వచ్చిన ఆ నగదును రౌతేలా విరాళంగా ఇచ్చింది.

 


logo