గురువారం 26 నవంబర్ 2020
Cinema - Aug 18, 2020 , 22:58:17

‘బ్లాక్‌ రోజ్‌' కహానీ

‘బ్లాక్‌ రోజ్‌' కహానీ

మాజీ మిస్‌ ఇండియా ఊర్వశి రౌతేల కథానాయికగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం ‘బ్లాక్‌ రోజ్‌'. మోహన్‌ భరద్వాజ్‌ దర్శకుడు. సంపత్‌నంది రచించారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రియేట్‌ చేస్తున్న దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ ‘షేక్స్‌పియర్‌ రచించిన ‘ది మర్చంట్‌ ఆఫ్‌ వెనిస్‌'లో షైలాక్‌ అనే పాత్రను ఆధారంగా చేసుకొని ఫిమేల్‌ ఓరియెంటెడ్‌ ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. ‘విచక్షణ, యోగ్యతలేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం’ అనే కౌటిల్యుడి అర్థశాస్త్రంలోని కాన్సెప్ట్‌ ఆధారంగా నిర్మిస్తున్నాం’ అన్నారు. ‘సోమవారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టాం. చిత్ర యూనిట్‌కు కోవిడ్‌-19పరీక్షలు నిర్వహించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ చిత్రాన్ని ఒకే షెడ్యూల్‌లో పూర్తిచేస్తాం’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి రచన: సంపత్‌నంది, మోహన్‌భరద్వాజ్‌, సినిమాటోగ్రఫీ: సౌందర్‌రాజన్‌, సంగీతం: మణిశర్మ, క్రియేటెడ్‌ బై: సంపత్‌నంది.