శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 17, 2021 , 13:16:02

‘ఉప్పెన’ వేగాన్ని ఆప‌త‌ర‌మా..!

‘ఉప్పెన’ వేగాన్ని ఆప‌త‌ర‌మా..!

విడుద‌ల‌కు ముందే సెన్సేష‌న్ క్రియేట్ చేసే చిత్రాలు చాలా అరుదుగా వ‌స్తాయి. ఆ కేట‌గిరీలోకే వ‌స్తుంది వైష్ణ‌వ్ తేజ్ డెబ్యూట్ చిత్రం ఉప్పెన‌. బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం పోస్ట‌ర్లు, పాట‌లు, టీజ‌ర్..ఇలా తొలి నుంచి ప్ర‌తీ విష‌యంలో రికార్డులు సృష్ట‌స్తూ వ‌స్తోంది. ఇప్ప‌టికే ఈ మూవీలోని పాట‌లు మిలియ‌న్ల సంఖ్య‌లో వ్యూస్ సాధించి..సంగీత ప్రియుల్ని కొత్త లోకంలోకి తీసుకెళ్లాయి. తాజాగా ఈ చిత్రం మ‌రో అరుదైన ఫీట్ సాధించింది. 

ఉప్పెన టీజ‌ర్ కేవ‌లం నాలుగు రోజుల్లోనే 6 మిలియ‌న్ల వ్యూస్ సాధించ‌గా..2,50, 000 లైక్స్ వ‌చ్చాయి. వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. 'దేవుడే వరాలిస్తాడ‌ని నాక‌ర్థ‌మయింది. ఎవ‌రికి పుట్టామో అంద‌రికీ తెలుస్తుంది.. కానీ ఎవ‌రి కోసం పుట్టానో నా చిన్న‌ప్పుడే తెలిసిపోయింది'..అంటూ హీరో వైష్ణ‌వ్‌తేజ సంభాష‌ణ‌లతో సాగే టీజ‌ర్ ప్రేక్ష‌క‌లోకాన్ని అల‌రిస్తోంది. మంగ‌ళూరు భామ కృతిశెట్టి హీరోయిన్ గా న‌టిస్తోంది. దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. టీజ‌ర్ పై మీరూ ఓ లుక్కేయండి మరి..


ఇవి కూడా చ‌ద‌వండి

మ‌రిది కోసం సినిమా సెట్ చేసిన స‌మంత‌..!

ఆర్మీ ఆఫీస‌ర్ గా సోనూసూద్..మ్యూజిక్ వీడియో

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!

మ‌రో క్రేజీ ప్రాజెక్టులో స‌ముద్ర‌ఖ‌ని..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo