సోమవారం 03 ఆగస్టు 2020
Cinema - Jul 03, 2020 , 19:58:04

నో ఓటీటీ..థియేటర్లలోనే ‘ఉప్పెన’ చిత్రం !

నో ఓటీటీ..థియేటర్లలోనే ‘ఉప్పెన’ చిత్రం !

హైదరాబాద్ : కరోనా ఎఫెక్ట్ తో టాలీవుడ్ సినిమాలు ఇపుడు ఒక్కొక్కటిగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఇప్పటికే భానుమతి అండ్ రామకృష్ణ, రాంగోపాల్ వర్మ ‘నేక్ డ్ నంగా నగ్నమ్’, ‘47 డేస్’ డిజిటల్ ప్లాట్ ఫాంలో  విడుదలయ్యాయి. సాయిధరమ్‌ తేజ్ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం ఉప్పెన. క్రితి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా ప్రభావంతో సినిమా థియేటర్ల రీఓపెనింగ్ పై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఉప్పెన చిత్రం డిజిటల్ ప్లాట్ ఫాంలో రానుందని వార్తలు చక్కర్లు కొట్టాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఉప్పెన చిత్రాన్ని థియేటర్ లో మాత్రమే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్ పెట్టడం, టాప్ టెక్నీషియన్లు, కొత్త నటీనటులు ఉండటంతో పరిస్థితులు సద్దుమణిగి..థియేటర్ల ఓపెనింగ్ పై క్లారిటీ వచ్చిన తర్వాతే విడుదలపై నిర్ణయం తీసుకోవాలని, అప్పటిదాకా ఆగాలని చూస్తుందట చిత్రయూనిట్. logo