శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 02, 2020 , 23:56:18

విభిన్నమైన ప్రేమకథ

విభిన్నమైన ప్రేమకథ

పంజా వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉప్పెన’.  నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. బుచ్చిబాబు సానా దర్శకుడు. విజయ్‌ సేతుపతి కీలక పాత్రధారి. పవన్‌కల్యాణ్‌పుట్టినరోజు సందర్భంగా బుధవారం చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదలచేసింది. ఈ పోస్టర్‌లో వైష్ణవ్‌తేజ్‌ చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ‘విభిన్నమైన ప్రేమకథతో తెరకెక్కుతున్న చిత్రమిది. దేవిశ్రీప్రసాద్‌ స్వరపరచిన పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది. ‘నీ కన్ను నీలి సముద్రం..’ పాట వంద మిలియన్ల వ్యూస్‌ను దాటింది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. సానుకూల పరిస్థితులు ఏర్పడి థియేటర్లు తెరచుకోగానే చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఫామ్‌దత్‌ సైనుద్దీన్‌. 


తాజావార్తలు