మంగళవారం 02 జూన్ 2020
Cinema - Jan 24, 2020 , 00:56:23

వెల్లువెత్తిన ఆనందాల ‘ఉప్పెన’

వెల్లువెత్తిన ఆనందాల ‘ఉప్పెన’

సాయిధరమ్‌తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిసున్నాయి. ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు సాన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కృతిశెట్టి కథానాయిక. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు.

సాయిధరమ్‌తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిసున్నాయి. ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు సాన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కృతిశెట్టి కథానాయిక. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. ‘సముద్రం అలల నడుమ బాహువుల్ని చాపి ఆనందోత్సాహంతో కనిపిస్తున్న వైష్ణవ్‌తేజ్‌ స్టిల్‌ అందరిని ఆకట్టుకుంటున్నది.  ఆయన కలర్‌ఫుల్‌ కాస్ట్యూమ్స్‌ ధరించడం మరింత ఆకర్షణగా అనిపిస్తున్నది. వైష్ణవ్‌తేజ్‌ శారీరకభాష, సముద్ర నేపథ్యం, ఎగిసిపడుతున్న అలలు టైటిల్‌ భావాన్ని ప్రతిఫలిస్తున్నాయి. ‘ప్రేమ, యాక్షన్‌ అంశాలు మేళవించిన ఎమోషనల్‌ కథ ఇది. తమిళ అగ్రనటుడు విజయ్‌ సేతుపతి ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఏప్రిల్‌ 2న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని నిర్మాతలు తెలిపారు. సాయిచంద్‌, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శాందత్‌సైనుద్దీన్‌, ఎడిటర్‌: నవీన్‌నూలి, ఆర్ట్‌: మౌనిక రామకృష్ణ, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: అనిల్‌ వై, సీఈఓ: చెర్రీ, లైన్‌ ప్రొడ్యూసర్‌: అశోక్‌ బండ్రెడ్డి, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, కథ, దర్శకత్వం: బుచ్చిబాబు సాన.


logo