శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Feb 23, 2021 , 10:37:23

7 కోట్ల‌కు ఉప్పెన డిజిట‌ల్ రైట్స్.. రిలీజ్ ఎప్పుడంటే..!

7 కోట్ల‌కు ఉప్పెన డిజిట‌ల్ రైట్స్.. రిలీజ్ ఎప్పుడంటే..!

పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా.. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘ఉప్పెన’. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించిన ఈ చిత్రాన్ని త‌మిళం, హిందీలో రీమేక్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైన ఉప్పెన మూవీ ఇప్ప‌టికీ మంచి వ‌సూళ్ళ‌తో దూసుకుపోతుంది. అయితే ఈ చిత్రం డిజిట‌ల్ రైట్స్ 7 కోట్ల రూపాయ‌ల‌కు అమ్ముడుపోయిన‌ట్టు తెలుస్తుండ‌గా, ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

ఉప్పెన సినిమాలో క్లిష్ట‌మైన‌  అంశాన్ని కన్వెన్సింగ్‌గా ప్రజెంట్ చేయ‌డంతో ఈ మూవీకి ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భిస్తుంది. చిరంజీవి, బాల‌కృష్ణ‌, మ‌హేష్ బాబు వంటి స్టార్స్ ఉప్పెన సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించారు. మ‌హేష్ బాబు అయితే ఉప్పెన చిత్రాన్ని క్లాసిక్ మూవీగా అభివ‌ర్ణించ‌డం విశేషం. కొద్ది రోజులుగా చిత్ర హీరో వైష్ణ‌వ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు  ప‌లు సిటీస్‌కు వెళుతూ అక్క‌డ మూవీని ప్ర‌చారం చేసుకుంటున్నారు. 


VIDEOS

logo