శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 22, 2020 , 01:56:30

వలపు భావాల ఉప్పెన

వలపు భావాల ఉప్పెన

పంజా వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సానా దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రను పోషిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. సోమవారం కథానాయిక కృతిశెట్టి జన్మదినం సందర్భంగా ఆమె కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఈ పోస్టర్‌లో చేతులకు వేసుకుంటున్న గాజులను అపురూపంగా చూస్తూ కృతిశెట్టి కనిపిస్తోంది. ఈ పోస్టర్‌తో పాటు ‘సహజఅభినయాన్ని కనబరిచే అందమైన నటికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ చిత్రబృందం ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన పాటల్లో చక్కటి హావభావాలు, అందచందాలతో కృతిశెట్టి ఆకట్టుకుంది. ఓ జాలరి, అపురూప సౌందర్యరాశి అయిన ఓ అమ్మాయి మధ్య నడిచే హృద్యమైన ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  సాధారణ పరిస్థితులు నెలకొని థియేటర్లు తెరచుకోగానే సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సాయిచంద్‌, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, సినిమాటోగ్రఫీ:షామ్‌దత్‌ సైనుద్దీన్‌. logo