శనివారం 06 జూన్ 2020
Cinema - Apr 28, 2020 , 10:59:37

వ‌రుణ్ తేజ్‌ని ఢీకొట్ట‌నున్న క‌న్నడ స్టార్ హీరో..!

వ‌రుణ్ తేజ్‌ని ఢీకొట్ట‌నున్న క‌న్నడ స్టార్ హీరో..!

క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర 90ల స‌మ‌యంలో నేరుగా తెలుగు చిత్రాల‌ని తీసి ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన సంగ‌తి తెలిసిందే. మ‌ధ్య‌లో కొంత గ్యాప్ తీసుకున్న ఆయ‌న  2015లో వ‌చ్చిన స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి చిత్రంలో కీల‌క పాత్ర పోషించాడు. ఉపేంద్ర పాత్ర‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఆయ‌న టాలీవుడ్‌లో రెండు సినిమాల‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది.

వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు వెంకటేశ్, సిద్ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాక్సర్‌గా నటిస్తున్నారు వరుణ్‌తేజ్‌. ఈ సినిమాలో కన్నడ స్టార్‌ ఉపేంద్ర న‌టిస్తున్న‌ట్టు ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం చిత్రంలో ఆయ‌న విల‌న్‌గా క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రోవైపు మ‌హేష్ బాబు, ప‌ర‌శురాం కాంబినేష‌న్‌లో తెర‌కెక్కే చిత్రంలోను ఆయ‌న కీల‌క పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.  


logo