శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 08, 2020 , 00:25:20

ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా రాబోతున్న ‘రాధేశ్యామ్‌'

ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా  రాబోతున్న ‘రాధేశ్యామ్‌'

పుట్టినరోజు సందర్భంగా  అభిమానులకు సర్‌ప్రైజ్‌ను ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు ప్రభాస్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌'. రాధాకృష్ణకుమార్‌ దర్శకుడు. యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది. లాక్‌డౌన్‌ విరామం తర్వాత ఇటీవలే  చిత్రబృందం ఇటలీకి పయనమైంది.   ప్రస్తుతం ప్రభాస్‌తో       పాటు ప్రధాన తారాగణంపై ఇటలీలోని పురాతన భవంతుల్లో కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు.  ఈ నెల 23న ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. షూటింగ్‌ను జరుపుతూనే మరోవైపు టీజర్‌ను సిద్ధంచేసే పనిలో చిత్రబృందం బిజీగా ఉన్నట్లు తెలిసింది.  యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా ఈ సినిమా రూపుదిద్దుకోనున్నది. 

కిల్లర్‌ అప్‌డేట్‌..

నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా  సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మించనుంది.  దీపికా పదుకునే కథానాయికగా నటించనుంది. వేసవిలో ప్రారంభం కావాల్సిన సినిమా చిత్రీకరణ లాక్‌డౌన్‌ కారణంగా ఆలస్యముంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి నాగ్‌అశ్విన్‌ బుధవారం ట్విట్టర్‌ ద్వారా వెల్లడిస్తూ  ‘కరోనా వల్ల షూటింగ్‌ ప్రారంభం కావడానికి  చాలా సమయం పట్టనుంది. అందువల్లే సినిమా గురించి ఎక్కువగా చెప్పలేకపోతున్నా. కానీ ప్రభాస్‌  పుట్టినరోజుకు ముందే  కిల్లర్‌ అప్‌డేట్‌ను అభిమానులకు అందించబోతున్నాం’ అని తెలిపారు.