శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 20:44:41

తెలుగులో వ‌స్తున్న పాన్ ఇండియన్ సినిమాలు ఇవే..?

తెలుగులో వ‌స్తున్న పాన్ ఇండియన్ సినిమాలు ఇవే..?

తెలుగు ఇండస్ట్రీ రేంజ్ పెరిగిపోయింది. బాహుబలితోనే అది అర్థమైపోయింది.. తెలిసింది కాదు తెలియంది చెప్పాలి కదా అనుకుంటున్నారా..? అవును నిజమే.. ఒకప్పుడు తెలుగు సినిమా అనే వాళ్లం. కానీ ఇప్పుడు అలా కాదు ప్యాన్ ఇండియన్ సినిమా అనాలేమో..? ఎందుకంటే మరే ఇతర ఇండస్ట్రీలో లేనట్లుగా ఇప్పుడు తెలుగులో ప్యాన్ ఇండియన్ సినిమాలు వస్తున్నాయి. మన హీరోల కన్ను నార్త్ పై పడింది. అక్కడ జెండా పాతాలని మెంటల్ గా ఫిక్స్ అయిపోతున్నారు. అందుకే బ్యాగులు వేసుకుని ముంబై ఎక్స్ ప్రెస్ ఎక్కేస్తున్నారు. ముందు రాజమౌళి వెళ్లి అక్కడ బాహుబలితో జెండా దించేసి వచ్చాడు. ఆ తర్వాత ప్రభాస్ ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు ఆయన దారిలోనే చాలా మంది హీరోలు ప్యాన్ ఇండియన్ కథలు సిద్ధం చేసుకుంటున్నారు.

1. రాధే శ్యామ్: ప్రభాస్ నటించే ఏ సినిమా అయినా కూడా ఇప్పుడు ప్యాన్ ఇండియన్ ప్రాజెక్టే. ఎందుకంటే సాహో తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో 150 కోట్లు వసూలు చేసింది.


2. ఆదిపురుష్: ఓం రౌత్ తెరకెక్కించబోయే ఈ భారీ పౌరాణిక చిత్రంలో రాముడిగా నటించబోతున్నాడు ప్రభాస్. దీనికోసం 300 కోట్లకు పైగానే బడ్జెట్ పెడుతున్నారు.

3. నాగ్ అశ్విన్ సినిమా: టైమ్ మిషన్ కథతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఇందులో దేవకన్య కొడుకుగా ప్రభాస్ నటిస్తాడని ప్రచారం జరుగుతుంది. అశ్వినీదత్ ఈ సినిమాను ప్యాన్ ఇండియన్ స్థాయిలో 400 కోట్లతో నిర్మించాలని చూస్తున్నాడు.

4. ట్రిపుల్ ఆర్: బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశంలోనే ఉన్నాయి. 


5. పుష్ప: అల్లు అర్జున్ తొలిసారి ప్యాన్ ఇండియన్ కథ చేస్తున్నాడు. సుకుమార్ అన్ని భాషలకు సరిపోయేలా ఇందులో ఎమోషన్స్ ఉన్నాయంటున్నాడు.

6. మేజర్: 26 బై 11 అటాక్స్‌లో చనిపోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్ర ఆధారంగా అడవి శేష్ హీరోగా మహేష్ బాబు నిర్మిస్తున్న సినిమా మేజర్. ఇది కూడా అన్ని భాషల్లో విడుదలవుతుంది. గూడచారి దర్శకుడు శశికిరణ్ టిక్కా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 

7. ఫైటర్: పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న ఫైటర్ సినిమాను హిందీలో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నాడు. అన్ని భాషల్లోనూ ఈ సినిమా విడుదలవుతుంది. 


8. అహం బ్రహ్మాస్మి: మంచు మనోజ్ చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా అహం బ్రహ్మాస్మి. ప్యాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు మనోజ్.

9. మోసగాళ్లు: మంచు విష్ణు కూడా ప్యాన్ ఇండియన్ కథతోనే వస్తున్నాడు. వరల్డ్ బిగ్గెస్ట్ క్రైమ్ అంటూ కాజల్ తో కలిసి మోసాలు చేయడానికి వస్తున్నాడు మంచు విష్ణు.