ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 22, 2020 , 01:56:29

సంపాదకురాలిగా సమంత

సంపాదకురాలిగా సమంత

అగ్ర కథానాయిక సమంత ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన యువర్‌లైఫ్‌ వెబ్‌సైట్‌కు అతిథి సంపాదకురాలిగా వ్యవహరించనున్నారు. ఈ వెబ్‌సైట్‌ను యువర్‌లైఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల ప్రారంభించారు. నిపుణులైన వైద్యబృందం నుంచి ఆరోగ్య సూత్రాలు,  పోషకాల గురించిన వీడియోలు,  ఆహార నియమాల ప్రణాళికలను, జీవనశైలి సలహాల్ని ఈ వెబ్‌సైట్‌ ద్వారా అందించబోతున్నారు. పరిమిత బడ్జెట్‌లోనే ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, సూచనల్ని ఇవ్వబోతున్నారు. 

ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ ‘ప్రకృతి అనుకూలంగా జీవించడంతో పాటు సంపూర్ణ ఆరోగ్య, మానసిక భావోద్వేగాల సమతుల్యతతో జీవితం సాగించాలని నేను నమ్ముతాను. ఈ విలువల్ని గౌరవించే వారిలో సమంత కూడా ఒకరు. ఆమె సేంద్రీయ వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తున్నారు. పూర్తి శాఖాహారపు జీవనాన్ని అనుసరిస్తూ, ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆమె నైపుణ్యం మా పాఠకులకు చేరువవుతుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.


logo