ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Aug 02, 2020 , 12:23:27

మోహ‌న్‌బాబు ఇంటి వ‌ద్ద దుండ‌గుల హ‌ల్‌చ‌ల్‌

మోహ‌న్‌బాబు ఇంటి వ‌ద్ద దుండ‌గుల హ‌ల్‌చ‌ల్‌

రంగారెడ్డి : సినీ న‌టుడు మోహ‌న్‌బాబు ఇంటి వ‌ద్ద గుర్తు తెలియ‌ని దుండ‌గులు శ‌నివారం రాత్రి హ‌ల్‌చ‌ల్ చేశారు. జ‌ల్‌ప‌ల్లిలోని మోహ‌న్‌బాబు ఫాంహౌస్ వ‌ద్ద‌కు కొంత‌మంది వ్య‌క్తులు నిన్న రాత్రి వ‌చ్చారు. ఫాంహౌస్ వ‌ద్ద దుండ‌గులు హ‌ల్‌చ‌ల్ చేస్తూ.. మిమ్మ‌ల్ని వ‌ద‌ల‌మంటూ హెచ్చ‌రించారు. దీంతో మోహ‌న్‌బాబు కుటుంబ స‌భ్యులు ప‌హ‌డీష‌రీఫ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మోహ‌న్‌బాబు ఇంటి వ‌ద్ద న‌మోదైన సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలించారు. కారు నంబ‌ర్ ఆధారంగా నిందితుల‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల‌ను మైలార్‌దేవ్‌ప‌ల్లిలోని దుర్గాన‌గ‌ర్‌కు చెందిన వార‌ని పోలీసులు తెలిపారు. దుండ‌గుల హెచ్చ‌రిక‌ల వెనుక ఎవ‌రైనా ఉన్నారా? లేదా కావాల‌నే చేశార‌? అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. దుండ‌గుల కాల్‌డేటాను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. కారు నంబ‌ర్ - ఏపీ 31 ఏఎన్ 0004. 


logo