బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 12, 2020 , 16:52:36

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అనూహ్య స్పందన

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అనూహ్య స్పందన

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్  నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది. ఒకరి నుంచి మరొకరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరిస్తూ సెలెబ్రిటీలు తమ వంతుగా మొక్కలు నాటుతున్నారు. లోరా అమ్ము ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి సంజీవయ్య పార్క్ లో  నటి సంధ్య జానక్ మూడు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా సంధ్య జానక్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం అపూర్వమైందన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటండి. ఆకు పచ్చని తెలంగాణకు సహకరించండని పిలుపునిచ్చారు.

తనకు ఈ అవకాశాన్ని కల్పించిన ఎంపీ  సంతోష్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తను మరో ముగ్గురికి (యాక్టర్ శరత్ బాబు, నటి కవిత, నటుడు కోటేశ్వర రావు)  మొక్కలు నాటాల్సిందిగా ఛాలెంజ్  విసిరారు.

 logo