ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 03, 2020 , 19:47:17

ఓటీటీలో విడుదల కానున్న ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’

ఓటీటీలో విడుదల కానున్న ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌లో భాగంగా సినిమా థియేటర్లు మూతబడ్డాయి. దీంతో ఓటీటీ వేదికగా కొత్త చిత్రాల విడుదల జోరందుకుంది. తాజాగా బాహుబలి వంటి భారీ బడ్జెట్‌ చిత్రం తర్వాత శోభూ యార్లగడ్డ నిర్మించిన సినిమా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ కూడా ఓటీటీలో విడుదల కానుంది.

ఈ నెల 15న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో సత్యదేవ్‌ ప్రధాన పాత్ర పోషించారు. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేం వెంకటేష్‌ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నరేష్‌, హరి చందన, జబర్దస్త్‌ రాంప్రసాద్‌, టీఎన్‌ఆర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత బిజిబాల్‌ సంగీతం అందించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo